సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సుధాకర్ రెడ్డి తనను చాంబర్లో కలిసి నామినేషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు రాతపూర్వకంగా లేఖ అందజేశారని కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ […]
సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]
సామాజిక సారథి, నార్కెట్ పల్లి: రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనా గుత్తా సుఖేందర్ రెడ్డి మొదటి సారిగా నల్గొండ జిల్లాలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. నార్కెట్ పల్లి ఎంపీపీ సూదినిరెడ్డి నరేందర్ రెడ్డి, అమ్మానాబోలు సర్పంచ్ వరలక్ష్మిరాంరెడ్డి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఇటీవల కన్నుమూసిన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన సీనియర్ న్యాయవాది బాలీశ్వరయ్య కుటుంబాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహరెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాలీశ్వరయ్య న్యాయవాద వృత్తికి చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 50ఏళ్ల పాటు న్యాయరంగానికి ఆయన అందించిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయన్నారు. న్యాయవాద వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడని స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీశ్వరయ్య […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు నామినేషన్లు ఆమోదం పొందాయి. ఆరు తిరస్కరణకు గురయ్యాయని మహబూబ్‌నగర్‌జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ఎస్.వెంకట్రావు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ లో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ.శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు […]
సామాజిక సారథి, సిద్దిపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ […]
సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్, రవి, మండల రైతు […]
సామాజిక సారథి, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సిలివేరు వినయ్ కుమార్ కు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్ రావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్ రావు, లైన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ, చింతనిప్పు వెంకటయ్య, నంబూరి […]