సారథి, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. టీఆర్ఎస్‌లో ఎన్నో ట్విస్ట్ ల మధ్య నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. అభ్యర్థిని ప్రకటించడంతో పాటు వెంటనే బీ ఫామ్ కూడా అందజేయడంతో ఉత్కంఠతకు తెరతీసినట్లయింది. నర్సింహాయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తానన్న హామీ మేరకు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారంలో […]
సారథి, నాగార్జునసాగర్: మాలలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలు ఐక్యంగా ఉండి చైతన్యం చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్‌చేశారు. ఎస్సీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ ఐక్యవేదికను ఏర్పాటుచేస్తామన్నారు. సాగర్ లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే […]
సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్ లేదని హెచ్చరించారు. […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జగ్గుల చిన్నయ్యకు తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జెగ్గుల చిన్నయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి కళాకారుడుగా శ్రీకృష్ణరాయబారం, చింతామణి హరిశ్చంద్ర నాటకాల్లో పలు పాత్రలను పోషించి కళాభిమానుల ఆదరణ పొందినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం సంతోషంగా […]
సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్లైన్చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.
సారథి, రామడుగు: దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. సుమారు 50 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏప్రిల్3,4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ఆర్యవైశ్య భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ […]
సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు […]
సారథి, రామగుండం: పెద్దపెల్లి జిల్లా ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శిగా మెంటు ఉదయ్ రాజ్ ను రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ నియమించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి కృషి చేస్తూ, విద్యార్థుల సమస్యలపై రాజీ పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియామకానికి కృషి చేసిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్, జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు మారబోయిన రవికుమార్, బొంతల రాజేష్, […]