Breaking News

గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు మాయం చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలు కొత్త వ్యక్తులు, మూఢనమ్మకాలను నమ్మిమోసపోవద్దన్నారు. గ్రామాల్లో పేకాట, గుట్కాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 100 లేదా 99490 51595 నంబర్​ కు డయల్ చేసి సమాచారం అందించాలని ఎస్సై రవి కోరారు.