Breaking News

Month: October 2020

యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం

యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం

సారథి న్యూస్, తలకొండపల్లి: ప్రజాసమస్యల పరిష్కారానికి అనునిత్యం సేవలందించిన దివంగత సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనను హైదరాబాద్​లోని తన నివాసంలో యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య మృతి తనను కలచివేసిందన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తనను కలవాలని సూచించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కుటుంబసభ్యులు, […]

Read More
రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా […]

Read More
బీజేపీ నేతల అరెస్ట్​అక్రమం

బీజేపీ నేతల అరెస్ట్ ​అక్రమం

సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ ​చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్​రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్​రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్​రెడ్డి అక్రమంగా అరెస్ట్ ​చేశారని ఖండించారు. అనంతరం […]

Read More
రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్​కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల […]

Read More
పంజాబ్​ అజేయం

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]

Read More
నాయిని సతీమణి అహల్య కన్నుమూత

నాయిని సతీమణి అహల్య కన్నుమూత

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య(680 కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. నాయిని నర్సింహారెడ్డి ఈనెల 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారినపడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహారెడ్డి మృతితో చివరి చూపునకు అహల్యను కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. కరోనా నెగటివ్ […]

Read More
డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: క్రమశిక్షణతో ఉంటూ స్టేషన్ కు వచ్చే బాధితులను గౌరవిస్తూ పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలని కోరారు. 9నెలల ట్రైనింగ్ అనంతరం జిల్లా పోలీసు డిపార్ట్​మెంట్​లో విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడులోని సీఎన్​జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ పలు సూచనలు […]

Read More
తేమ లేని వడ్లు తీసుకురండి

తేమ లేని వడ్లు తీసుకురండి

సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ​హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు […]

Read More