Breaking News

Day: October 11, 2020

శ్రీరామ్​మందిరం కూల్చివేత.. పాకిస్థాన్​లో దారుణం

పాకిస్థాన్​లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్​ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్‌’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్​లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. […]

Read More

కానిస్టేబుల్​తో భార్య అఫైర్​.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త!

కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన రవి అనే వ్యక్తి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్​ నడుపుతున్నది. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఏఆర్​ కానిస్టేబుల్ వంశీకృష్ణ​తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భార్య ప్రవర్తనతో రవికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది. భార్యను ఎలాగైనా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని రవి […]

Read More

గంగవ్వా.. ఫికర్​ జెయ్యకు నేను ఇల్లు కట్టిస్తా!

బిగ్​బాస్​ హౌస్​లో టాప్​ కంటెస్టెంట్​గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్​లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్​రిపోర్ట్స్​ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్​ చేసిందంటే ఆమె హౌస్​లో ఎంత […]

Read More
ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: గతనెలలో అర్ధాంతరంగా వాయిదాపడిన శాసనసభా సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ సమావేశాలను ఫక్తు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు, అందుకోసం చట్టాల్లో సవరణల కోసమే నిర్వహించనున్నారు. కరోనా కారణంగా సెప్టెంబర్​ 28వ తేదీ వరకూ కొనసాగాల్సిన సమావేశాలు, ఆనెల 16కే వాయిదా పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధుల్లో అనేక మందికి కరోనా సోకిన కారణంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు […]

Read More
బతుకమ్మ చీరలు పంపిణీ

బతుకమ్మ చీరలు పంపిణీ

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీని శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్​ కోమల్ రెడ్డి, […]

Read More
మావోయిస్టుల దుశ్చర్య

మావోయిస్టుల దుశ్చర్య

టీఆర్ఎస్ ​నాయకుడి దారుణహత్య ఘటనను ఖండించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సారథి న్యూస్, వెంకటాపురం(ములుగు): మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.. శనివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​నాయకుడు మాడురి భీమేశ్వర్ రావు(50)ను దారుణంగా హతమార్చారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. సంఘటన స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘అధికార పార్టీలో […]

Read More
తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు’ అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం […]

Read More