Breaking News

కానిస్టేబుల్​తో భార్య అఫైర్​.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త!

కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన రవి అనే వ్యక్తి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్​ నడుపుతున్నది. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఏఆర్​ కానిస్టేబుల్ వంశీకృష్ణ​తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భార్య ప్రవర్తనతో రవికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది.

భార్యను ఎలాగైనా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని రవి ప్లాన్​ వేశాడు. అందుకోసం రాయదుర్గం పీఎస్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సహాయం తీసుకున్నాడు. శనివారం ఎప్పటిలాగే బ్యూటీ పార్లర్​కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన భార్య ఏఆర్​ కానిస్టేబుల్​ వంశీకృష్ణతో కలిసి హోటల్​కు వెళ్లింది. దీంతో రవి కానిస్టేబుల్​తో కలిసి హోటల్​కు వెళ్లి వాళ్లను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.