Breaking News

Day: October 11, 2020

ఎదురులేని ‘ముంబై’

ఎదురులేని ‘ముంబై’

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా క్వింటాన్‌ డీకాక్‌ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్యకుమార్‌ యాదవ్‌ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15), కృనాల్​(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్​ బౌలర్లు బౌల్ట్​ ఒక […]

Read More
భారీవర్షానికి కూలిన ఇల్లు

భారీవర్షానికి కూలిన ఇల్లు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

Read More
కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు […]

Read More
కో ఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక

కోఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా నర్సింలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.

Read More
భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, […]

Read More
కొనుగోలు కేంద్రాలను తెరవండి

కొనుగోలు కేంద్రాలను తెరవండి

సారథి న్యూస్, హైదారాబాద్: వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. వరి క్వింటాలుకు రూ.1880కి అమ్మాల్సిన ధాన్యం రూ.1600, రూ.5,825 అమ్మాల్సిన పత్తి రూ.3,500కు అమ్ముతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వ్యవసాయశాఖ మార్కెటింగ్‌ శాఖ, సివిల్‌ సప్లయీస్​ శాఖల మధ్య సమన్వయం లేక మార్కెటింగ్‌ సక్రమంగా జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర […]

Read More
గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రైతాంగం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా చర్చింది.– కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే […]

Read More
అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన […]

Read More