Breaking News

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత జీవితాలను పక్కనబెట్టి విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. కరోనా మహమ్మారికి ఇంతవరకూ రాష్ట్రంలో పాతిక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా పథకం వర్తింపజేయాలని కోరారు. స్థానిక గరిమెళ్ల ప్రెస్ క్లబ్ నుంచి పెద్దసంఖ్యలో జర్నలిస్టులు ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ నడిచి వెళ్లి అక్కడ గాంధీజీ విగ్రహానికి సత్యాగ్రహ వినతిపత్రం సమర్పించారు.