సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద 50 అడుగుల లోతులో ఉన్న లోయలో వ్యాన్పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిన క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికి తీస్తున్నారు.క్షత్రగాత్రులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కల్వకుర్తి నేషనల్హైవే 167 నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూరు, కరివేన నేషనల్హైవే 340 ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని మంగళవారం నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు నేషనల్రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవేస్ సెక్రటరీ గిరిధర్‌ను కలిసి కోరారు. గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కోసం డీపీఆర్‌ను త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో […]
భూరికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష సారథి న్యూస్, హైదారాబాద్: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదుకాని ఆస్తుల […]
సారథి న్యూస్, కర్నూలు: ‘ఏపీ పోలీస్‌సేవ మొబైల్యాప్’ను సోమవారం తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీసులంటే సేవకులని, పోలీసులంటే భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను కుటుంబసభ్యులుగా భావించి మనం పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే కార్యక్రమం దిశగా ‘ఏపీ పోలీసు సేవ మొబైల్ యాప్’ ఉపయోగపడుతుందన్నారు. కర్నూలు నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో […]
సారథి న్యూస్, రామాయంపేట: లంబాడీల ఐక్య వేదిక మెదక్ నియోజకవర్గ ఇంచార్జిగా నిజాంపేట మండలం జెడ్ చెరువు తండాకు చెందిన రమావత్ భాస్కర్ ఎన్నికయ్యారు. లంబాడాల హక్కుల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. అదినాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్‌నర్సు, సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్‌కాలేజీ ప్రిన్సిపల్, ఏడీఎంఈ డాక్టర్‌చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన […]
సారథి న్యూస్, రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు శనివారం పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల రామడుగు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో బీజేపీ నాయకులు నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ట రవీందర్, అంజిబాబు, రాజేంద్రచారి, రాజు, సత్యనారాయణ, భరత్, శ్రీకాంత్, వెంకటేశ్, గాలిపల్లి రాజు, శ్రీనివాస చారి, పోచమల్లు, మల్లేశం పాల్గొన్నారు.