అబుదాబి: ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ 42(31), డికాక్ 33(20), పొలార్డ్18(14) […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్ పథక సంచాలకులు డాక్టర్జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: నేరస్తులు ఎవరైనా సరే శిక్షపడేలా కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఆఫీసులో మణుగూరు సర్కిల్, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా కృషిచేయాలని ఆదేశించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటించాలన్నారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ గురుస్వామి, మణుగూరు సీఐ షుకూర్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం.. చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లపేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోవడం, మీకు చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: చిట్టీల వ్యాపారంతో పలువురిని మోసం చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ శనివారం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మనసాని రమేష్వి విధ గ్రామాల వ్యాపారుల వద్ద చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి గతేడాది ఊరు నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అతని […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు […]
కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్-13వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్ముంబై ఇండియన్స్.. రన్నరప్ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్‌శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్‌సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాచెన్నై సూపర్‌కింగ్ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద […]