సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్‌కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు […]
సారథి న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా వైరా విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సుమారు 270 మంది రైతులకు రూ.90లక్షల విలువైన పంట రుణాల చెక్కులను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ శనివారం క్యాంపు ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. రైతులు స్వల్పకాలిక రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. గొల్లపూడి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]
సారథి న్యూస్, హైదరాబాద్: గవర్నర్ తమిళ్సై సౌందర్‌రాజన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అనంతరం తమిళ్సై బాబాయ్ మృతిచెందడంతో ముఖ్యమంత్రి పరామర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు వసంత కుమార్ కరోనాతో ఇటీవల కన్నుమూసిన తెలిసిందే. వసంత కుమార్ ప్రస్తుతం తమిళనాడు […]
న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర […]
అమరావతి: బిగ్బాస్ఫేం, పవన్‌కల్యాణ్ అభిమాని, ‘పరాన్నజీవి’ దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడు ఘోర అవమానానికి గురయ్యాడు. కర్రి శ్రీకాంత్ అనే ఓ దళిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్నాడు. నూతన్ భార్య మధుప్రియ శ్రీకాంత్‌పై దొంగతనం నేరం మోపడంతో అతడు పనికి రావడం లేదు. ఈ క్రమంలో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. శ్రీకాంత్‌ను తన ఇంటికి పిలిపించి అతడికి గుండు కొట్టించింది. కాగా ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ […]
గత ఐదేండ్లుగా తనపై 139 మంది లైంగికదాడి చేశారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించింది. అందులో యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఇప్పటికే ప్రదీప్ స్పందించారు. తాజాగా, మరో నటుడు కృష్ణుడు కూడా ఈ వివాదంపై మాట్లాడారు. నాకు ఏపాపం తెలియదని చెప్పారు. కొందరు తనను కుట్రపూరితంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ‘నాపై ఆరోపణలు రావడంతో షాక్‌కు […]
అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ […]