Breaking News

Day: August 23, 2020

సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సారథి న్యూస్, నాగార్జునసాగర్: కృష్ణానది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతుండ‌డంతో శ్రీ‌శైలం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్​డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్​14 గేట్లను ఎత్తి 3,28,440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.3 అడుగుల మేర ఉంది. 3,28,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రిజర్వాయర్​లోకి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.6838 టీఎంసీలు ఉంది. నాగార్జున […]

Read More

మ్యాట్రిమోనిలతో జాగ్రత్త..!

సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రామడుగుకు చెందిన ఓ యువకుడికి తెలుగు మ్యాటిమోనిలో ఓ యువతి పరిచయమైంది. తాను అమెరికాలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్న యువతి..పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విలువైన ఎలక్ట్రానిక్​ వస్తువులు, డైమండ్​ రింగ్​, యుస్​ డాలర్స్​ పంపుతానని యువకుడిని నమ్మించింది. అనంతరం […]

Read More
మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళా

మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళా

సారథి న్యూస్​, హైదరాబాద్​: మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ ఇతర రెవెన్యూ విభాగం సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం, బుధవారం సదస్సులు నిర్వహించి పరిష్కరించనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 15 వరకు కల్పిస్తున్నట్టు పేర్కొంది. రెవెన్యూ సదస్సులు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతాయని వెల్లడించింది.– డోర్ నంబర్ కోసం […]

Read More
‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కృష్ణారెడ్డి కుటుంబాన్ని కల్వకుర్తిలోని వారి నివాసంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఎడ్మ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి పుష్పలత, కొడుకు కల్వకుర్తి మున్సిపల్ ​చైర్మన్​ ఎడ్మ సత్యంతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి వెంట ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి […]

Read More
ఏపీలో 7,895 కరోనా కేసులు

ఏపీలో 7,895 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 […]

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

డీసీపీ సార్​.. మీరు సూపర్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఓ పోలీస్​ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్​అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]

Read More

సోనియాకు సీనియర్ల ఘాటు ‘లేఖ’

సారథిమీడియా, హైదరాబాద్​: ఏఐసీసీ (ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్​ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్​ […]

Read More