Breaking News

Day: August 22, 2020

దోమ తెరలు పంపిణీ

దోమ తెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్​ ఆఫీసర్​ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ […]

Read More
శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బృందం

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బృందం

సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు ను సందర్శించి గేట్లను పరిశీలించి.. డ్యాంకు వస్తున్న వరద పరిస్థితి, ఇన్​ఫ్లో, ఔట్​ ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ జెన్​ కో పవర్ హౌస్ […]

Read More

మట్టిగణపతే.. మహాగణపతి

సారథిన్యూస్​, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్​ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.

Read More

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

సారథిన్యూస్​, రామగుండం: రామగుండం కమిషనరేట్​ పరధిలో గణేశ్​ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్​ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.

Read More

తెలంగాణలో కొత్త నౌకర్లు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రప్రభుత్వం త్వరలోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పురపాలకశాఖలో వార్డు ఆఫీసర్లు అనే కొత్తపోస్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ప్రగతిభవన్​లో తన శాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు కేటీఆర్​ తెలిపారు. వార్డు ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. […]

Read More

అడుగు అడుగుకో మడుగు

సారథిన్యూస్, రామడుగు: మీరు చూస్తున్న ఈ ఫోటో ఎక్కడో మారుమూల గ్రామంలోనిది కాదు.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఓ రోడ్డు. రామడుగు వరద కాల్వ నుంచి చిప్పకుర్తి పోయే రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తెలి గుంతలు పడి నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాలి నడకన వెళ్లే వారుసైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వాన్నంగా మారడంతో రోగులు, గర్భిణి లు అవస్థలు పడుతున్నారు. గతంలో వరద కాల్వ నిర్మాణ […]

Read More