మళయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శిన్ కూతురైన కళ్యాణి.. నటుడు మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ను వివాహం చేసుకోనున్నట్టు టాక్. దర్శకుడు ప్రియదర్శిన్.. మోహన్‌లాల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ క్రమంలో కళ్యాణి.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ప్రణవ్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్. కల్యాణి పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. ‘హలో’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దగుమ్మ, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ వంటి చిత్రాల్లో నటించింది. ఇరు కుటుంబాల […]
న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జేఈఈ, నీట్‌ను వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం వారి పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలకవ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కు ఎంపీ పోతుగంటి రాములు కృతజ్ఞతలు తెలిపారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన నివేథా థామస్ చాన్స్ దక్కించుకుందట. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికాపదుకొనే హీరోయిన్గా ఎంపికకాగా.. సెకండ్ హీరోయిన్గా నివేథా థామస్‌ను తీసుకోనున్నట్టు టాక్. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. కాగా బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ విజయవంతం కాకపోయినప్పటికీ.. ఉత్తరాదిన మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచన మేరకు ఆదివారం చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీతోపాటు మోర్చా అధ్యక్షుల కమిటీని నియమించినట్లు మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి తెలిపారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్త, ప్రకాష్ హాజరయ్యారు. నరేందర్, దశరథ్, ప్రధాన కార్యదర్శులుగా పెంటాగౌడ్, మేడిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్ లు ఉపాధ్యక్షుడిగా వడ్ల సిద్ధిరాములు, సంతోష్ రెడ్డి, సురేష్, కార్యదర్శులుగా బాలసుబ్రమణ్యం కోశాధికారిగా ఎంపికయ్యారు.
గతేడాది విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విభిన్నకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కార్తీ హీరో నటించగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. కత్రీనాను హీరోయిన్గా ఎంపికచేశారట. వాస్తవానికి తమిళ మాతృకలో హీరోయిన్ పాత్ర ఉండదు. హిందీలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్రను యాడ్చేసినట్టు సమాచారం. […]
భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2014, సెప్టెంబర్ 8న భద్రాచలం […]