ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించినట్లు మీడియా బులెటిన్‌లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 68,946కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 49,675 మంది కోలుకున్నారని వెల్లడించారు. 18,708 మంది చికిత్స తీసుకుంటున్నారు. […]
బెంగళూరు: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ సీఎంలకు కరోనాకు అంటుకోగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్ చేశారు. […]
బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య ఆటోలో సెక్రటేరియట్‌కు వచ్చిన ప్రజానేత సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
తాను బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనడం లేదని పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్‌బాస్‌లో సీజన్ 4లో పాల్గొనేది వీళ్లనంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు తాము బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే యువనటుడు తరుణ్, హీరోయిన్ శ్రద్ధాదాస్ తాము బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రద్ధాదాస్ అయితే ఏకంగా మీడియాపైనే ఫైర్ అయ్యింది. తనపై తప్పడు వార్తలు […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రజాగొంతుక మూగబోయింది. తన పాటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను విప్లవోన్ముఖులను చేసిన ఓ తార నింగికెగిసింది. ప్రజాగాయకుడు, విప్లవకవి, ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు. 1970లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజనుల ఉద్యమంలో ఆయన పాట తొలిసారి ప్రాచుర్యం పొందింది. […]
సారథి న్యూస్, భద్రాచలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజయ్య మృతికి తెలంగాణ సీఎం […]