సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విక్రమ్ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్‌ఘర్ రేషన్ యోజన’ పథకం కింద రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్‌స్టార్ ట్రైలర్‌ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్‌ను అఫిషియల్‌గా రిలీజ్ చేయకముందే కొందరు ఇంటర్నెట్లో లీక్చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్‌లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం […]
రెండు వారాలుగా టాలీవుడ్లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్‌గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]
భువనేశ్వర్: లాక్‌డౌన్ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పాడ్డరు. కాగా, సోనూసూద్ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్ అనే వలస కార్మికుడు […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం పథకాలను పకడ్బందీగా వర్తింపచేయడంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ సక్సెస్ అయ్యారు. కలెక్టరేట్ అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ‘రైతు భరోసా, మన పాలన మీ సూచన, జగనన్న చేదోడు’ వంటి పథకాలను ప్రణాళికబద్ధంగా అమలుచేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. జగనన్న చేదోడు పథకంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానం, ముస్లిం మైనార్టీలో ప్రథమస్థానం దక్కించుకోవడంపై జేసీ […]
వాక్సిన్ తీసుకున్న ఇద్దరు వలంటీర్లు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై ప్రయోగాలు సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ హుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి […]