Breaking News

Day: July 18, 2020

‘వైఎస్సార్​చేయూత’’కు 21 వరకు గడువు

‘వైఎస్సార్​ చేయూత’కు 21 వరకు గడువు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్​చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేల ఆర్థికసాయం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.

Read More
చైతన్యంతోనే కరోనా కట్టడి

చైతన్యంతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన పనిలేదని నగర పాలక కమిషనర్ డీకే బాలజీ సూచించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో కలియ తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మహమ్మారికి భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కులను ధరించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దని, ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. నగరపాలక […]

Read More
కంటైన్​మెంట్​ జోన్లపై నజర్​

కంటైన్​మెంట్​ జోన్లపై నజర్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభణ నేపథ్యంలో కర్నూలు నగరంలోని కంటైన్​మెంట్​జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని శనివారం కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ సమీక్షించారు. నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు, మాలగేరి, వడ్డేగేరి, పెద్దమార్కెట్, పూలబజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గనిగల్లీ నగర్, ఉస్మానియా కాలేజీ మీదుగా తదితర ప్రాంతాల్లోని పలురోడ్లు, వీధుల్లోని కంటైన్​మెంట్​ జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని కాన్వాయ్ లో కలియ […]

Read More
ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్​ వీరపాండియన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్​కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్​ శెట్టి మాట్లాడుతూ.. […]

Read More

దూదేకుల సంఘం ఎన్నిక

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్​) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్​గా ఖాసీం సాబ్​, కోకన్వీనర్​గా ఫిరోజ్​, కోశాధికారిగా ఇమామ్​ సాబ్​, సలహాదారుడిగా అహ్మద్​ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ […]

Read More
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్​గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్​ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, […]

Read More

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథి న్యూస్​, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్​లో ఎల్లంపల్లి రిజర్వాయర్​ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, పాలకుర్తి తహసీల్దార్​ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

Read More

కందనూలు రూపురేఖలు మార్చుదాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్​ ఎల్​ శర్మన్​ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్​ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్​వాక్​చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్​ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్​లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్​ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్​కర్నూల్ […]

Read More