Breaking News

Day: June 30, 2020

ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ ​అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్​లైన్​లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, […]

Read More
వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Read More
తెలంగాణలో 945 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 945 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 869 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ లో 13, సంగారెడ్డి జిల్లాలో 21 చొప్పున మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. రాష్ట్రంలో 8,795 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య […]

Read More

స.హ.చ అధ్యక్షుడిగా పరుశురాం

సారథిన్యూస్, రామడుగు: సమాచార హక్కు చట్టం రామడుగు మండల అధ్యక్షుడిగా అనుపురం పరుశరాంను నియమిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయి లో సమాచార హక్కు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. పరుశురాంను జిల్లా అధ్యక్షుడు కోలిపాక శేఖర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​ వేణుగోపాల్ గౌడ్ అభినందించారు.

Read More

ఆదిలాబాద్​పై వివక్ష

సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్​ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్​తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు […]

Read More
హరితహారం సక్సెస్​ కావాలి

హరితహారం సక్సెస్​ కావాలి

సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్​బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు […]

Read More
పతంజలి యూ టర్న్

పతంజలి యూ టర్న్

న్యూఢిల్లీ: కరోనాకు మందు కనిపెట్టామని ఈ మాత్రలు వేసుకుంటే కరోనా పూర్తిగా నయమవుతుందని పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తిచేశామని, 90శాతం రిజల్ట్స్ ఉంటాయని కూడా ప్రచారం చేసింది. కాగా, ఈ విషయంపై పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా మందుపై ట్రయల్స్ కు అనుమతిచ్చిన ఆస్పత్రికి కూడా నోటీసులు పంపింది. దాంతో పతంజలి సంస్థ మాట మారుస్తూ యూ టర్న్ తీసుకుంది. తాము కరోనాకు అసలు […]

Read More
12 మంది పోలీసులకు కరోనా

డ్యూటీలో అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతోంది. జిల్లాలో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా తేలింది. విధుల్లో ఉండే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. డ్యూటీలో ఉన్న సమయంలో సామాజిక దూరం పాటిస్తూనే తప్పనిసరిగా మాస్క్​లు కట్టుకోవాలని సూచించారు. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నవాబ్​పేట మండలం కొల్లూరు గ్రామంలో మీసేవ నిర్వాహకుడు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Read More