సారథి న్యూస్, హైదరాబాద్: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియాకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పర్యవేక్షించాలని సూచించారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయా వర్గాల్లో భరోసా నింపిందని చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మీటింగ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడువేల గ్రామాల్లో పర్యటించిందన్నారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మున్సిపల్‌శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో ఇంటర్మీడియట్, 6, 7, 8 తరగతుల్లో అడ్మిషన్ల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట […]
సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులుపంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ […]
సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్‌బాబు తయారు కావాలని ఆకాంక్షించారు
సారథి న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.