Breaking News

Month: May 2020

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

–వాహనాలు సీజ్.. చలానా విధింపు సారథి న్యూస్, అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనంతపురం జిల్లా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో విపత్తు నిర్వహణ, తదితర చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ కేసులు నమోదుచేశారు. రోడ్డుభద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,07,982 నమోదుచేసి..రూ.4,63,05,620 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2,604 వాహనాలను సీజ్ […]

Read More
సౌకర్యాలు బాగున్నాయా..?

సౌకర్యాలు బాగున్నాయా..?

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కంటైన్​ మెంట్​ జోన్ పీఎన్ కాలనీలో కలెక్టర్ జె.నివాస్ శనివారం పర్యటించారు. ప్రజలకు సౌకర్యాలు ఏ మేరకు అందుతున్నాయో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కాలనీలో ప్రతిఇంటికి తాగునీరు, కిరాణా సామగ్రి, కూరగాయలు, మందులు నిత్యావసర సరుకులు విధిగా అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కూడా పాలు, సిరిలాక్ వంటి బేబీ ఆహార పదార్థాలను అందజేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ […]

Read More
రేపు ‘గాంధీ’పై పూలవర్షం

‘గాంధీ’పై పూలవర్షం

ఎయిర్​ ఫోర్స్​, పూలవర్షం –    వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు, వైరస్ బారినపడిన రోగులకు నిరంతరం సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి ఎప్పటికీ మరువలేనిది. ఈ నేపథ్యంలో హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాంధీ ఆస్పత్రిపై ఆదివారం (ఏప్రిల్​ 3న) ఉదయం 9.30 గంటలకు పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో పాలుపంచుకున్న ఈ విషయంపై త్రివిధ దళాధిపతులు […]

Read More
ఈఎస్ఐలో కేంద్ర బృందం

ఈఎస్ఐలో కేంద్ర బృందం

కరోనా వైద్యంపై ఆరా సారథి న్యూస్, హైదరాబాద్: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్రబృందం శ‌నివారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా డీన్ డాక్టర్ శ్రీ‌నివాస్‌, సూప‌రింటెండెంట్ డాక్టర్ పాల్‌, ఇత‌ర వైద్యాధికారుల‌తో క‌లిసి ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. కోవిడ్‌-19 పాజిటివ్ కేసుల‌కు వైద్యసేవ‌ల ఏర్పాట్ల గురించి వాక‌బుచేశారు. అనంత‌రం చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గోడౌన్​ ను ప‌రిశీలించి బియ్యం నిల్వల గురించి తెలుసుకున్నారు. బృందంలో […]

Read More
ఇది మరిచిపోలేని రోజు

ఇది మరిచిపోలేని రోజు

 ఇది మరిచిపోలేని రోజు. – మంత్రి హరీశ్ రావు సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం దలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ ​పర్సన్​ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఇరిగేషన్ ఇంజనీర్ హరిరాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ […]

Read More
రోడ్ల పనులు స్పీడ్​ అప్ చేయండి

రోడ్ల పనులు స్పీడ్​ అప్ చేయండి

అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు మరింత వేగవంతంగా ముందుకెళ్లాలని మంత్రి కె.తారక రామారావు సూచించారు. శనివారం బుద్దభవన్ లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్​శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టాల్సిన పనుల ప్రగతిపై సమీక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ […]

Read More
లిఫ్ట్ నుంచి జారిపడి..

లిఫ్ట్ నుంచి జారిపడి..

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రమాదవశాత్తు లిఫ్ట్ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని   హస్తినాపురం డివిజన్​ సాగర్ రోడ్డు ఓంకార్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఇక్రిశాట్​ మాజీ ఉద్యోగి జె.కృష్ణ గౌడ్ (62) శుక్రవారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్ పై వాకింగ్ చేసి లిఫ్ట్ నుంచి కిందికి దిగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తలుపులు తెరుచుకుని ఐదంతస్తుల […]

Read More
కరెంట్ షాక్​తో మహిళ మృతి

కరెంట్ షాక్​తో మహిళ మృతి

సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్​ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ […]

Read More