Breaking News

సీపీఎం

హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]

Read More
దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్​చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.

Read More
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 […]

Read More
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More
ప్రజలను ఆదుకోండి: సీపీఎం

ప్రజలను ఆదుకోండి: సీపీఎం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, […]

Read More

వరదబాధితులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్​ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్​ మండలం భగవాన్​ నాయక్​ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్​ఎఫ్​ఐ […]

Read More