Breaking News

రామగుండం

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

సారథి న్యూస్, ధర్మారం(రామగుండం): అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ బహూకరించి నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధిదీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,82,500 విలువైన చెక్కులను 9మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

Read More
రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

సారథి న్యూస్, రామగుండం: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లయిన్​వరకు రోడ్డు విస్తరణ పనులను కంపెనీ చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​అర్జీ-1 ఏరియా జీఎం కె.నారాయణను కోరారు. తిలక్ నగర్ సెంటర్ ఏరియాలో రోడ్లు వేయించాలని, అన్నివర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అర్జీ-1 ఏరియాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎం […]

Read More
సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సారథి న్యూస్​, రామగుండం: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా 35శాతం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం రీజియన్​ పరిధిలోని వకీల్ పల్లె గనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్, ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి రాజరత్నం, సీపీఐ నాయకుడు జి.గోవర్ధన్, శంకర్, కిరణ్, సంపత్, వెంకటేష్, రాజు, మల్లేష్, ప్రదీప్ కార్మికులు పాల్గొన్నారు.

Read More
పర్యాటక హబ్ గా గోదావరి తీరం

పర్యాటక హబ్ గా గోదావరి తీరం

సారథి న్యూస్, రామగుండం: వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహాసంకల్పంతో మఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలం కావడంతో గోదావరికి జలకళ సంతరించుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదీతీరాన్ని పర్యాటక హబ్​గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఆదివారం గోదావరి నది వద్ద అడ్వంచర్ అండ్ అక్వా, టూరిజం డెవలప్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమైక్యపాలనలో […]

Read More
ప్రైవేటు స్కూలు టీచర్లను ఆదుకోండి

ప్రైవేటు స్కూలు టీచర్లను ఆదుకోండి

సారథి న్యూస్, రామగుండం: ప్రైవేట్ స్కూళ్ల సమస్యలను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ట్రస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ అరుకాల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆదర్, సండే సల్మారావు ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని, టీచర్ల జీతాలు ఇవ్వాలని, విద్యారంగాన్ని రక్షించాలని, టీచర్లకు నెలకు రూ.10వేల జీవనభృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

Read More

ఆటోడ్రైవర్లకు మాస్కుల పంపిణీ

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్​ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆడబిడ్డలకు వరం.. భగీరథ పథకం

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​భగీరథ పథకం.. ఆడబిడ్డలకు వరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సీఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నల్లాద్వారా శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, […]

Read More
త్యాగాలకు ప్రతీక మొహర్రం

త్యాగాలకు ప్రతీక మొహర్రం

సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.

Read More