సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జల్లా రామడుగు మండలంలో ని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మొక్కుబడిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టవేని అంజిబాబు, భరత్ చారి, కనకం శ్రీనివాస్, గజ్జెల అశోక్, మునిగంట శ్రీనివాస చారి తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: భారతీయ జనతాపార్టీని బలోపేతం చేద్దామని కరీంనగర్ జిల్లా రామడుగు మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంబటి నర్సింగరావు, కారుపకల అంజి, ఏముండ్ల కుమార్, తారకొండ ఐలయ్య, ప్రధానకార్యదర్శులుగా తోట, కృష్ణ, రమేశ్, చంద్రమౌళి, కార్యదర్శి గుంట అశోక్, చింతాపంటి అశోక్, సిరిమల్ల మదన్మోహన్, దమ్మయ్య భూపతి, కోశాధికారి గంట్లా శరత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా స్వామి, శ్రీధర్, కనకయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్‌లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బుధవారం లేఖ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్ షాప్ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్‌మార్టం […]
న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్ బహిష్కృత నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్‌పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్ పైలట్ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన […]
సారథి న్యూస్, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీ.. సంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడులో పాగా వేసేందుకు చిరకాల కోరిక తీర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే తమిళ తలైవా.. రజనీకాంత్‌ను తన అండదండలు ఉంటాయని ప్రకటించింది. కానీ.. రజనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొదలైందట. అక్కడ పార్టీ పెట్టిన […]
సారథిన్యూస్, కొత్తగూడెం: బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్, కేక్ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్‌రెడ్డి, నాయకులు, […]