సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్ చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ శృతిఓజా, ఎస్పీ రంజన్‌రతన్ కుమార్‌తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికిపై ఉండాలని కోరుతూ జడ్పీ చైర్పర్సన్సరిత అమ్మవారికి పట్టువస్త్రాలు అలంకరించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, వడేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మునగాల నరసింహులు, […]
సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, పద్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు సాహితీని అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేసే జింకల కిరణ్ కుమార్ రెడ్డికి 50 […]
దసరా రోజున భవనాల ప్రారంభోత్సవం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణాలు పూర్తి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): వ్యవసాయమే పరమావధిగా భావించే రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చేయూతనందిస్తోంది. రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను పంచుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనీసం రెండువేల మంది రైతులు ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవగాహన సదస్సుకు హాజరయ్యేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 97భవనాల నిర్మాణాలు […]
రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో […]
సారథి న్యూస్, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 26వ వార్డు కాలనీకి చెందిన ఓ మహిళ నదిఅగ్రహారం వద్ద కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లి కొట్టుకుపోయింది. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. ఆమె జాడ కోసం గజ ఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నారు. ఎస్సై సత్యనారాయణ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్‌లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.