విజయనగరం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాంబశివరాజు వైఎస్సార్సీపీలో చేరారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు సాంబశివరాజు ఏపీ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా, […]
సారథిన్యూస్, విజయనగరం: దేశవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా వైరస్ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా సోకినట్టు సమాచారం.
తిరిగొచ్చిన వలస జీవులు గ్రామాల్లో జనకళ సారథి న్యూస్, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి […]
రెండు నెలల్లో రూ.50లక్షలకు పైగా ఆదాయం నష్టం ఉద్యోగులకు మూడునెలలుగా సగం జీతమే చెల్లింపు భక్తుల కోరికపై ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజలు సారథి న్యూస్, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు పైడితల్లి అమ్మవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. మార్చిలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల ద్వారా వచ్చే లక్షల ఆదాయానికి గండిపడింది. ఆలయ హుండీల ద్వారా వచ్చే […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,497 మంది శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది. ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా […]