Breaking News

Day: June 9, 2020

ఆరుగురిని కబళించిన కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం కరోనాతో ఆరుగురు మృతిచెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 148 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్​ జిల్లాలో 10, సంగారెడ్డి, మహబూబ్​ నగర్​, మెదక్​ జిల్లాల్లో […]

Read More

పనులు క్వాలిటీగా ఉండాలె

సారథి న్యూస్​, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ పట్టణంలోని జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత మలోత్​ కవిత మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆర్అండ్​బీ గెస్ట్​హౌస్​, కేజీబీవీ స్కూలు, ఎస్పీ ఆఫీసు పనులను పరిశీలించారు. పనులు క్వాలిటీగా ఉండాలని సూచించారు. వారి వెంట జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​, జడ్పీ చైర్​పర్సన్​ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Read More

పోచారం డ్యామ్​కు కొండపోచమ్మ నీళ్లు

సారథి న్యూస్​, మెదక్​: ఎస్​ఆర్​సీ కొండపోచమ్మ సాగర్​ ద్వారా పోచారం డ్యాం నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందజేస్తామని మంత్రి హరీశ్​ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన మెదక్​ మండలం రాజ్​పేట్​ శివారులో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అన్నిటి కంటే ముందుగా పోచారం సాగర్​ ప్రాజెక్టు నిండుతుందన్నారు. అయినప్పటికీ కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ ఎంఎన్ కెనాల్ మీదుగా ప్రాజెక్టును నింపి సాగునీరు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, […]

Read More

ఏసీబీ వలలో పెద్దఅంబర్ పేట్ కమిషనర్

సారథి న్యూస్, ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీసీపీ సూర్యానారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామానికి చెందిన సురభి వెంకట్ రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణ అనుమతుల విషయంలో కమిషనర్ రవీందర్ రావు బాధితుడు వెంకట్ రెడ్డిని రూ1.5 లక్షలు డిమాండ్ చేయగా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం […]

Read More

జులై 31 నాటికి ఢిల్లీలో 5.5 లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రతి 12 నుంచి 13 రోజులకు కేసులు డబుల్‌ అవుతున్నాయని చెప్పారు. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున 80వేల బెడ్లు […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్ట్

సారథి న్యూస్, మెదక్: నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని మంత్రి హరీశ్​రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పక్కా సమాచారంతో గ్రీన్ బుక్ రూపొందించాలని సూచించారు. మెదక్​ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిమాండ్​ ఉన్న పంటలనే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతు అర్హులైన రైతులందరికీ […]

Read More

జర్నలిస్టులను ఆదుకోవాలి…….

సారథి న్యూస్​, వెల్దండ : కాటుకు బలైపోయినటువంటి జర్నలిస్టు మనోజ్ మరణం చాలా బాధాకమని, మనోజ్ మరణానికి కారణమైన మీడియా యాజమాన్యం,ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ‌రాష్ట్ర కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ తెలిపారు. కరోన కాటుకు బలైన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం,మీడియా యాజమాన్యం ఆదుకోవాలని అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,రూ.50 లక్షల ఎక్సగ్రెసియో ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ […]

Read More

ఆదుకున్న రైతు బీమా

సారథి న్యూస్, చొప్పదండి: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకం ఓ కుటుంబాన్ని ఆదుకున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందినపిట్టల రాజు, మనీషా తండ్రి గతములో చనిపోయాడు. తల్లి విజయ కూడా ఇటీవల మరణించింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. కాగా, తల్లి విజయ పేరు మీద భూమి ఉండడంతో రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు వారి పిల్లలకు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​రాజు,మనీషాకు చెక్కును మంగళవారం […]

Read More