Breaking News

మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

విజయనగరం: మాజీమంత్రి, వైఎస్సార్​సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాంబశివరాజు వైఎస్సార్​సీపీలో చేరారు.

రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు

సాంబశివరాజు ఏపీ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా, 8సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989-94లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్‌గా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ అసెంబ్లీ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహించారు. కాగా, 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన మంత్రిపట్ల సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్​సీపీ ముఖ్యనేతలు సంతాపం ప్రకటించారు.