Breaking News

TERRORISTS

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్‌ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్‌ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్‌ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్‌ ఆపరేషన్‌’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్‌ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు అన్నారు. పూంచ్‌, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]

Read More

భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్​ఐఏ ( నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్​ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్​ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]

Read More

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు హతం

శ్రీనగర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్​లోని పంతాచౌక్​ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్​పీఎఫ్​కు చెందిన ఓ అసిస్టెంట్​ సబ్​ఇన్​స్పెక్టర్​ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్​ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్​ చేసుకున్నట్టు సమాచారం.

Read More

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గామ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రర్‌‌ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌‌లో హతమైన వలీద్‌ అనే టెర్రరిస్టు […]

Read More

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్​లోని బందిపోర్​లో బీజేపీ నేత వసీమ్​ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్​, అతడి తండ్రి బషీర్​, సోదరుడు ఉమర్​ బషీర్​పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్​స్టేషన్​కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]

Read More

ముగ్గురు ఉగ్రవాదులు హతం

అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్​నగాగ్​ జిల్లా ఖుల్​చోహార్​ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో పోలీసులు, ఆర్మీ జవాన్ల గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. శనివారం చేవా ఉల్లార్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి […]

Read More

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని సొపోర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read More