ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్‌ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]
సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్‌రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు […]
తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్‌లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో […]
సారథిన్యూస్, అమరావతి: జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసపాలన కొనసాగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారందని ఈ రాక్షస ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇంతకంటే ఈ రాష్ట్రంలో దారుణమైన విషయం ఏముంటది అనిపేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్ వేయించారని, పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి […]
సారథిన్యూస్, అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు కొంత కాలంగా కరోనా, ఇతర అరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రమేష్ ఆస్పత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించింది. ఈఎస్‌ఐ స్కాంలో రూ. 150 కోట్లు అవకతవకలు జరుగడంతో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు […]