హెలిక్యాప్టర్ ప్రమాదంలో 13 మంది దుర్మరణం మృతుల్లో బిపిన్‌రావత్ దంపతులు తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయయారు. వారు ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ […]
చెపాక్ నుంచి నాడు కరుణానిధి నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో […]
న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం వెలువరించారు. కేరళలో 140, అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే […]
త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్ చెబుతూ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తమిళనాడు సర్కారుకు సీఎం కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామగ్రిని కూడా పంపిణీ చేసేందుకు ముందుకురావడంపై ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామికి ధన్యవాదాలు తెలిపారు. భారీవర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి […]
నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి.. చెన్నై: ఆరుగాలం కష్టపడే రైతులకు పంటలు సాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘కొద్దిపాటి సాయం’ కూడా వారికి అందకుండాపోతోంది. నకిలీ లబ్ధిదారులను చూపిస్తూ పలువురు అధికారుల అండతో రైతులకు అందాల్సిన నగదును కూడా అవినీతి తిమింగళాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అన్నదాతలకు నగదు సాయం అందించే ‘పీఎం కిసాన్’ పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా.. నకిలీ […]
కిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు శ్యామ్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోడంబాక్కంలో శ్యామ్ పోకర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్‌ను అతడు గ్యాంబ్లింగ్ చేస్తూ పలువురిని మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు శ్యాంను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం, ఊసరవెల్లి , కత్తి, వంటి సినిమాలో శ్యాం నటించాడు. ఇతడు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీ.. సంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడులో పాగా వేసేందుకు చిరకాల కోరిక తీర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే తమిళ తలైవా.. రజనీకాంత్‌ను తన అండదండలు ఉంటాయని ప్రకటించింది. కానీ.. రజనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొదలైందట. అక్కడ పార్టీ పెట్టిన […]