సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. […]
సారథి న్యూస్, రామాయంపేట: ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వ్యవసాయంలో మౌలిక మార్పులు సాధ్యమని మెదక్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ అన్నారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామ రైతు వేదికలో శుక్రవారం రైతులకు పంటలో సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపాధి హామీ పథకం గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని రైతులు ఎదగవచ్చన్నారు. వరినాట్లు వేసే సమయంలో రైతులకు […]
రెండు విభాగాలుగా చేసి ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించాలి మరిన్ని సంస్థాగత మార్పులు జరగాలి వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ప్రగతిభవన్ లో శుక్రవారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష […]
సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి. […]
దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం యాజమాన్య హక్కు సమస్యలను పరిష్కరించాలి నియంత్రిత సాగు.. రైతుల్లో గొప్ప పరివర్తన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో […]
సారథి న్యూస్, చొప్పదండి: కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్నా.. రైతులకు రైతుబంధు డబ్బులను ఇచ్చిన ధీశాలి కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. ప్రతిరైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి పంక్షన్హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం నిర్మించనున్న కల్లాల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయా చైర్మన్ ఏనుగు రవీందర్ […]