లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లకీంపూర్లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామానికి 200 మీటర్ల దూరం మృతదేహం దొరికింది. పోస్ట్‌మార్టం నిర్వహించగా లైంగికదాడి జరిగినట్టు తేలింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తనపై పగతోనే దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాని పేర్కొన్నారు. […]
సారథిన్యూస్, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్‌లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మావోయిస్ట్ కీలకనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట. […]
త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. తబారియా జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా మూడో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటిపక్కల ఉండే ఎనిమిది మంది బాలురు.. చిన్నారిని ఆడకొనేందుకు పిలిచారు. తెలిసినవాళ్లే కావడంతో చిన్నారి వాళ్లతో వెళ్లింది. దీంతో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఏడుగురు లైంగకదాడికి […]
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్‌లోని పంతాచౌక్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్పీఎఫ్కు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్ చేసుకున్నట్టు సమాచారం.
సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్‌షాప్‌లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]