ఖార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాంచి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్ పై రూ.ఐదు, డీజిల్ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ […]
సామజిక సారథి, రాజోలి : డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]
సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పెట్రోల్, డిజిల్ ధరలను వెంటనే డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డిజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే పెట్రో ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ […]
న్యూఢిల్లీ: దేశంలో గత 20 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా పెట్రల్ పై లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.80.13కి చేరగా.. డీజిల్ ధర రూ.80.19.. ఈ నెల 7 నుంచి ప్రతి రోజు డీజిల్, పెట్రోల్‌పై రేట్లను ఆయిల్ కంపెనీలు రివైజ్ చేస్తూనే ఉన్నాయి. కేవలం బుధవారం ఒక్కరోజు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. డీజిల్ ధరలు […]
సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కరోనాను అరికట్టడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య , సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేశ్, వామపక్ష నాయకులు తోకల రమేశ్, మహేశ్వరీ, లావణ్య, ఫైముదా, పీర్ మహ్మద్, మోగిలి, ఎం దుర్గయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా […]
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధర వరుసగా బుధవారం 18వ రోజు పెరిగింది. పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. దీంతో డీజిల్ రేటు పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. డీజిల్‌పైన 0.48 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో రూ.79.40 ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.79.88కి చేరింది. పెట్రోల్ ధర రూ.79.76గా ఉంది. ఈ 18 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.41, […]