సారథిన్యూస్, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీవన్ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఆయన కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి […]
సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.
సారథిన్యూస్, గోదావరిఖని: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్లో ఎల్లంపల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పాలకుర్తి తహసీల్దార్ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్ సింగ్ రాజ్ రాకూర్ సహకారంతో కాంగ్రెస్ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ […]