న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]
సారథి న్యూస్, నరసన్నపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన గంగిరెడ్డి పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు పొందారన్నారు. కడప జిల్లాలో వైఎస్సార్ సీపీ ఐలోపేతానికి గంగిరెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. నిత్యం అందుబాటులో ఉండి […]
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్‌కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్‌గా పేరు ఉండేది. […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత […]
ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్ ఐడల్ రన్నరప్‌గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్‌చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.
చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు 10న వసంత్‌కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ సంతాపం తెలిపారు. వసంత్‌కుమార్ మృతి కాంగ్రెస్ తీరని […]
కోల్‌కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.దీంతో కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి […]
సారథి న్యూస్, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్ఎడిటర్గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్ఎడిటర్గా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ […]