Breaking News

PADDY

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]

Read More
అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో […]

Read More

దోమపోటును తరిమేద్దామిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్​ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]

Read More

వరిలో మొగిపురుగును అరికట్టండిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్​ లేదా కార్టప్​హైడ్రోక్లోరైడ్​ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.

Read More

కంది పంట వేయండి

సారథి న్యూస్, రామాయంపేట: నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మంగళవారం బాచురాజ్​పల్లి, నగరంతండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న పంటకు బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని సూచించారు. 60శాతం సన్నరకాలు సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, గణేష్, సర్పంచ్​లు నరసవ్వ, గేమ్ సింగ్, ఎంపీటీసీలు లత సురేష్, రవి, రైతుబంధు సమన్వయ సమితి గ్రామకోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.

Read More