Breaking News

NEW

ఖమ్మంలో సిమ్యులేటర్​ ప్రారంభం

రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు

సారథి న్యూస్​, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్​ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్​ సిమ్యులేటర్​ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More
అమలాపాల్​ న్యూ వెబ్​సీరీస్​

వివాదాస్పద పాత్రలో అమలాపాల్​

వైవిధ్యమైన పాత్రలు ఎంపికచేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అమలాపాల్​ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అమల ఓ ఢిపరెంట్ వెబ్​సీరీస్​లో నటించనున్నదని టాక్​. ఆమలా పాల్ గతచిత్రం ‘ఆమె’ కూడా వివాదాస్పదమైంది. మహేశ్​భట్​, జియో స్టూడియోస్​ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓ వెబ్​సీరీస్​లో నటించనున్నారట అమల. తమిళంలో అత్యంత వివాదాస్పదమైన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందట.

Read More
కొత్తగా 60 వేల కేసులు

60వేల కొత్త కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 60 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులసంఖ్య 20,88,611కు చేరుకున్నది. ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 14,27,005 మంది డిశ్చార్జి అయ్యారు. 6,19,088 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంట్లో 933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరక శనివారం కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనా లక్షణాలు […]

Read More
మూడు భాషల విధానం మాకొద్దు

మూడుభాషల విధానం మాకొద్దు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్​ లాంగ్వేజ్​లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్​ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్​గా […]

Read More
సుశాంత్​ కేసులో మరో ట్విస్ట్​

సుశాంత్​ కేసులో మరో ట్విస్ట్​

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా సుశాంత్​ సింగ్​ బ్యాంక్​​ఖాతాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా […]

Read More
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

14 లక్షలకు చేరువలో కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More

ఆదిలాబాద్​లో అలజడి

సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్​లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కలెక్టర్​ ఓఎస్డీ, కలెక్టర్​ క్యాంప్​ క్లర్క్​లకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా  నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్​రేట్​కు వచ్చినవారిలో […]

Read More

12వేలకు చేరిన మృతులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More