సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్‌రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం […]
నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్‌సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్, సత్యం, డీపీవో సూపరింటెండెంట్ దయాకర్, ఆర్ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]
సారథిన్యూస్, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, ఎస్ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీశ్, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం […]
సారథి న్యూస్, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వెహికిల్స్ల్లో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని అనుమతించబోమని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. ఆదివారం పలు ఆదేశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులకు ఇకపై ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చనవారిలో పోలీస్, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.
సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. వాతావరణంలో సమతుల్యం లోపించడంతోనే వర్షాలు కురవడం లేదని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.