Breaking News

NAGARKURNOOL

హోటల్​ను కూల్చిన సర్పంచ్​​భర్తను అరెస్ట్​చేయాలి

హోటల్​ను కూల్చిన సర్పంచ్ ​భర్తను శిక్షించాలి

సారథి న్యూస్, వంగూరు: నాగర్​కర్నూల్ ​జిల్లా వంగూరు మండలం డిండిచింతపల్లిలో నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల విద్యాలయం పూర్వవిద్యార్థి రామచంద్రం నిర్వహిస్తున్న హోటల్​ను కూల్చివేసిన అదే గ్రామ సర్పంచ్ ​భర్త, టీఆర్ఎస్​ నాయకుడు బత్తిని రవీందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ ​చేయాలని ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్(ఏఐసీఎస్ వో) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్​రాజ్ ​ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. బుధవారం ఆయన జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరితో కలిసి బాధితుడు రామచంద్రంను […]

Read More
‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్, బిజినేపల్లి: నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అఖిల భారత నవోదయ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ ​ఎంపీ పి.రాములును బుధవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి మాట్లాడుతూ.. 2004 జనవరికి ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్​సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘకాలంగా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో […]

Read More
బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]

Read More
శాస్త్రోక్తంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

శాస్త్రోక్తంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కొరవి రామనుజచార్యులు ధనుర్మాస ప్రత్యేక పూజలను గురువారం శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.ఆంజనేయులు, సహాయ అర్చకుడు కొరవి జయంత్, శుక్ల, చక్రపాణి, ఆలయ సిబ్బంది శివకుమార్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Read More
కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్​డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు […]

Read More
శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

నందివడ్డెమాన్ లో శనీశ్వర స్వామికి అభిషేకాలు పరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలొచ్చి అభిషేకాలు, విశేష అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నువ్వులనూనె, నల్లటి వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను స్వామి వారికి నివేదన చేస్తారని, స్వామివారి అనుగ్రహం పొందేందుకు కొలుస్తారని ఆలయ […]

Read More
ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన […]

Read More
శనేశ్వర స్వామికి విశేషపూజలు

శనీశ్వర స్వామికి విశేష పూజలు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కార్తీకమాసం శనివారం త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా నివేదన చేశారని ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. అష్టోత్తర నామాలు, నల్లనువ్వులు నల్లటి వస్త్రం, నువ్వుల నూనె జిల్లేడు పూలు […]

Read More