.. ఆస్పత్రి ఆవరణలో నిద్రిస్తున్న బాలికపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. .. రోగుల బంధువులు ప్రతికటించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. తన తల్లి ప్రసవం కోసం వస్తే వెంట వచ్చిన బాలిక నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి అగంతకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి […]
సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]
సామాజిక సారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల […]
సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది. ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్ చేసినట్లు గిద్ద విజయ్ […]
నాగర్ కర్నూల్‌జిల్లాలో బీజేపీకి నాయకత్వ లోపం సరైన లీడర్లేక నిరుత్సాహంలో కేడర్ కల్వకుర్తిలో ఒంటరి పోరాటం చేస్తున్న టి.ఆచారి అచ్చంపేటలో ముందుకెళ్తున్న బంగారు శృతి రెండు పర్యాయాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కేడర్నిరుత్సాహంతో ఉంది. ఇదే పరిస్థితిని నాగర్ కర్నూల్జిల్లాలోనూ ఎదుర్కొంటోంది. సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: […]
సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
‘మళ్లీ ఎమ్మెల్సీ’ హామీతోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి.. టిక్కెట్ రాకపోవడంపై అనుచరవర్గంలో ఆందోళన అధిష్టానం నిర్ణయంపై వేచిచూసే ధోరణిలో కూచకుళ్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పలువురి పోటీ ఎమ్మెల్సీ కసిరెడ్డి, సాయిచంద్‌కు ‘స్థానిక సంస్థల’ టికెట్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్‌నేత, సిట్టింగ్ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి టీఆర్ఎస్అధిష్టానం మొండిచేయి చూపింది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఆయనకు ఈసారి […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా సోకగా.. తాజాగా జిల్లా దవాఖానలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మొత్తం 27 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ […]