Breaking News

MULUGU

ఇంటింటికీ వైద్యపరీక్షలు

ఇంటింటికీ వైద్యపరీక్షలు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా మెురుమూరు గ్రామపంచాయతీలో శుక్రవారం వాజేడు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించింది. అనంతరం ‘ప్రైడే డ్రైడే’ నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనివాస్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు.

Read More
అందరికీ కరోనా టెస్టులు చేయాలి

అందరికీ కరోనా టెస్టులు చేయాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్​చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్​కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్​ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, […]

Read More
మావోయిస్టు కరపత్రాల కలకలం

మావోయిస్టు కరపత్రాల కలకలం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్​ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]

Read More

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Read More
మెురుమూరులో వైద్యశిబిరం

మెురుమూరులో మెడికల్​ క్యాంపు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్​వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, […]

Read More
కూంబింగ్​అందుకోసమేనా?

కూంబింగ్​ అందుకోసమేనా?

దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్​సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్​గఢ్ ​సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ ​నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]

Read More
కొంగాలలో హెల్త్ క్యాంప్

కొంగాలలో హెల్త్ క్యాంప్

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.

Read More

దైవదర్శనం విషాదాంతం

సారథిన్యూస్​, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్​ సమీపంలోని ఘట్​కేసర్​ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్​రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More