Breaking News

MRPS

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

సారథి న్యూస్, మహబూబ్ నగర్: తాత, ముత్తాతల నుంచి దళితుల చేతుల్లో ఉన్న సాగు భూములను గుంజుకుంటే సర్కారుపై దండయాత్ర తప్పదని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో రిలే దీక్షలు చేపట్టిన బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితుడిని […]

Read More
అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో గిరిజన యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ.. దోషులకు శిక్షపడాలని డిమాండ్​చేస్తూ.. ఆదివారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరేళ్లుగా 139 సార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్​చేశారు. దోషులను ఎన్ కౌంటర్​ చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసును […]

Read More
పూలే విగ్రహ ధ్వంసం సరికాదు

పూలే విగ్రహధ్వంసం హేయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: వరంగల్ లో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి మాదిగ డిమాండ్ చేశారు. మురికివాడల్లో నివసించే పేద వారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యను అందించిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Read More

రాజగృహపై దాడి హేయం

గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్​ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్​పీఎస్​) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు మంతని సామిల్ […]

Read More
హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ పోరాటం

హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ పోరాటం

సారథి న్యూస్, హుస్నాబాద్: దళితుల హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ నిరంతర పోరాటాలు చేస్తుందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జేపీ లత అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి ఏబీసీడీ వర్గీకరణకు పోరాడలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితమేనన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ వెంకటస్వామి, నాయకులు లక్ష్మీనారాయణ, […]

Read More

దళితుల హక్కులను కాపాడుదాం

సారథిన్యూస్​, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంగళవారం ఎమ్మార్పీఎస్​ 26 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్​ కట్​చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడేందుకు ఎమ్మార్పీఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్​ లలిత జ్యోతియ్య మాదిగ, దళితసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్​, ఎమ్మార్పీఎస్​ జిల్లా కార్యదర్శి కృష్ణ మాదిగ, మండల […]

Read More

పేదలకు ఎమ్మార్పీఎస్ సాయం

సారథి న్యూస్, గోధావరిఖని: లాక్​ డౌన్​ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ,  అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More