Breaking News

దళితుల హక్కులను కాపాడుదాం

సారథిన్యూస్​, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంగళవారం ఎమ్మార్పీఎస్​ 26 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్​ కట్​చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడేందుకు ఎమ్మార్పీఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్​ లలిత జ్యోతియ్య మాదిగ, దళితసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్​, ఎమ్మార్పీఎస్​ జిల్లా కార్యదర్శి కృష్ణ మాదిగ, మండల అధ్యక్షుడు రాజు, నాయకులు హేమరాజు, రాజేందర్​, అమరేందర్​, శ్రీశైలం, నారాయణ, శేఖర్​, రమేశ్​, కిరణ్​, విజయ్​కుమార్​, శ్రీశైలం, శివరాజ్​, ఆంజనేయులు, వెంకటేశ్​, సురేష్, శ్రీశైలం, లింగం తదితరులు పాల్గొన్నారు.