సామాజికసారథి, మహబూబ్నగర్: మాదిగలకు సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు. వర్గీకరణ అమలు చేయకుండా 11వేల టీచర్ఉద్యోగాలను భర్తీచేయడంతో మాదిగ బిడ్డలు 500కు పైగా […]
సామాజిక సారథి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్, అనిల్ తదితరులు ఉన్నారు.
గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు మంతని సామిల్ […]