Breaking News

MP

నంది ఎల్లయ్య కన్నుమూత

నంది ఎల్లయ్య కన్నుమూత

సారథిన్యూస్​, హైదరాబాద్​: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో కొంతకాలం క్రితం నిమ్స్​లో చేరారు. తాజాగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దాంతో… కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నంది ఎల్లయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇతర అనారోగ్యసమస్యలతోనే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఎల్లయ్య మృతితో రాంనగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. నంది ఎల్లయ్య […]

Read More
ఎంపీ సీఎం రమేశ్కు కరోనా పాజిటివ్

ఎంపీ సీఎం రమేశ్​కు కరోనా

హైదరాబాద్​ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​ కోవిడ్​ బారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్​లో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన చెప్పారు.

Read More
కార్తీ చిదంబరానికి కరోనా

కార్తీ చిదంబరానికి కరోనా

చెన్నై: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా ప్రబలింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్​ చేశారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల కార్తీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా క్వారంటైన్​లో ఉండాలని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు.

Read More
ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా […]

Read More

అర్వింద్​పై దాడి అమానుషం

సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్​ జిన్నారం విద్యాసాగర్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్​, కల్లెం శివ, వెంకటేశ్​, అజయ్, […]

Read More

నటి సుమలతకు కరోనా

ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఫేస్​బుక్​లో పోస్టుచేశారు. ‘శనివారం నుంచి తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతున్నాను. దీంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్​ చేయించుకోగా పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం హోంక్వారంటైన్​లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనలతో మందులు వాడుతున్నాను. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా సోకినవారెవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండి మందులు వాడాలని సూచించారు.

Read More

టిక్​టాక్​ నిషేధంతో నిరుద్యోగం

కోల్‌కతా: టిక్​టాక్​ మొబైల్​ యాప్​పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్​టాక్​తో సహా మొత్తం 59 యాప్​లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ ​ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన […]

Read More

ఆదిలాబాద్​పై వివక్ష

సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్​ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్​తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు […]

Read More