తల్లీకొడుకు మృత్యువాత సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో […]
ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్ ఐడల్ రన్నరప్‌గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్‌చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణనటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్‌ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ […]
సారథిన్యూస్, హుస్నాబాద్: అప్పడే పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని డీఎంహెచ్‌వో మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈవో భాస్కర్, వైద్యాధికారులు మురళీకృష్ణ, సౌమ్య, శివయ్య, కనకయ్య, శ్రీనివాస్, వినీత్, రామ్మూర్తి, ప్రేమలత, సూపర్ వైజర్లు విజయ, ఎలగొండమ్మ, ఆశకార్యకర్తలు […]
తాగుడుకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు తల్లిని పీక పిసికి చంపేశాడు.. కాటికి కాలు చాపుకున్న వద్ధురాలైన తల్లిని పట్టెడన్నం పెట్టలేక ఇంటినుంచి వెళ్లగొట్టాడో మహానుభావుడు. ముసలి తల్లికి సేవలు చేయలేక బతికుండగానే శ్మశానంలోనే వదిలి వచ్చాడు మరో ప్రబుద్ధుడు. కన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి తమకు సమయం లేదని వందలాది మంది కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఇవి నిత్యకత్యంగా మారాయి. కానీ, ఢిల్లీలోని ఓ కొడుకు మాత్రం ఇలా చేయలేదు. పైగా కన్నతల్లిని కాపాడుకునేందుకు […]
కాబూల్: సన్‌రైజర్స్ ఆటగాడు, అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం నెలకొన్నది. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను అభిమానులతో పంచుకుంటూ రషీద్ ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు. ‘అమ్మా.. నువ్వే నా సర్వసం. ఇప్పుడు నాకు నీ అండ లేదు. నువ్వు లేకుండా నేను లేను. నువ్వు లేవనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ అత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ […]
తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ రైల్వే స్టేషన్లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న […]