సారథి న్యూస్, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్ ఆగ్రో స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]
సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల […]
సారథిన్యూస్, రామడుగు/ బోయినపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 8లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యాక్రమంలో బాధితులు, ఆయాగ్రామాల సర్పంచుల్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కోల్‌కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.దీంతో కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి […]