సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్‌యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్‌లతో […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు […]
సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్ లింగంగౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: రైస్ మిల్లర్లు ఫుడ్ కార్పొరేషన్ కు బియ్యం త్వరగా సరఫరా చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు. వానాకాలం బియ్యం సేకరణపై శనివారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లిష్టసమయంలోనూ టార్గెట్ మేరకు ధాన్యం సేకరించినందుకు మిల్లర్లను అభినందించారు. బియ్యం కూడా త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు అదనంగా కేటాయించిన రా బియ్యం 2,700 టన్నులను బాయిల్డ్ మిల్లర్లు ఈనెల 15 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేయాలని […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు తేలడంతో వైద్యసిబ్బంది హోం క్వారంటైన్ ముద్రవేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి నార్లాపూర్ లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లడంతో శుక్రవారం వారిని కూడా వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు.
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్ లేదా కార్టప్హైడ్రోక్లోరైడ్ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]
సారథి న్యూస్ నర్సాపూర్: రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ఆర్ తో పాటు కౌడిపల్లి లో రైతు వేదికల స్థలాలను పరిశీలించారు. రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలన్నారు. నియంత్రిత సాగు విధానాన్ని ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో 55.7లక్షల […]