సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్డౌన్ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్హాల్లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్, ఎస్సై, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షడు […]
సారథి న్యూస్, మెదక్: బడ్జెట్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదవారికి ఇబ్బందులు రాకుండా అనేక పథకాలను ప్రవేశపెడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని వివరించారు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేటలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు 153 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 36 ఈ పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశారు. కరోనాకు బయపడాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇటీవల మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి ఆనకట్టలోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. 0.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆనకట్ట పూర్తిగా నిండింది. ఘనపూర్ ఆనకట్ట కింద కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండడంతో మహబూబ్‌నహర్, ఫతేనహర్కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే అవకాశం […]
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్‌స్టేషన్‌లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్ మందిర్, ప్రభుమందిర్, విట్టలేశ్వరమందిర్, మార్కండేయ మందిర్‌లో వినాయక విగ్రహాలను ఏర్పాటు […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ తన నివాసంలో మొక్కనాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు ఇవ్వడంతో మొక్కలను నాటినట్లు తెలిపారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచన మేరకు ఆదివారం చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీతోపాటు మోర్చా అధ్యక్షుల కమిటీని నియమించినట్లు మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి తెలిపారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్త, ప్రకాష్ హాజరయ్యారు. నరేందర్, దశరథ్, ప్రధాన కార్యదర్శులుగా పెంటాగౌడ్, మేడిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్ లు ఉపాధ్యక్షుడిగా వడ్ల సిద్ధిరాములు, సంతోష్ రెడ్డి, సురేష్, కార్యదర్శులుగా బాలసుబ్రమణ్యం కోశాధికారిగా ఎంపికయ్యారు.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో ఏదైనా విపత్తులు, ఇళ్లు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే సమాచారం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా మంగళి యాదగిరి, ప్రధానకార్యదర్శులుగా నరేందర్, దశరథ్, ఉపాధ్యక్షులుగా పెంటా గౌడ్, మేడి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్, కార్యదర్శులుగా వడ్ల సిద్ధిరాములు, సంతోశ్‌రెడ్డి, సురేశ్, కోశాధికారిగా బాలసుబ్రమణ్యం, యువ మోర్చా అధ్యక్షుడిగా మహేశ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేశ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మూర్తి శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డప్పు స్వామి, మైనార్టీ మోర్చా […]