Breaking News

medak

ప్రకృతివనాల పనులు పూర్తవ్వాలే

ప్రకృతివనాల పనులు పూర్తవ్వాలే

సారథి న్యూస్, మెదక్: ఈనెల 11వ తేదీలోగా మెదక్ ​జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేవించారు. శుక్రవారం ఆయన కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 429 పంచాయతీలతో పాటు గుర్తించిన 84 మదిర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 27లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధరణి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. […]

Read More
ధరణితో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్

ధరణితో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్

సారథి న్యూస్, మెదక్: ధరణి పోర్టల్ పనితీరును మెదక్ ​జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం కౌడిపల్లిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ ద్వారా కేవలం 15 నిముషాల్లోనే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుందన్నారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పట్టా […]

Read More
దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]

Read More
చివరి గింజ దాకా కొంటాం

చివరి గింజ దాకా కొంటాం

సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]

Read More
వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి భవానీ మాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తూ.. స్థానిక భవానీ మాత మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ముందుకుసాగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్​ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.

Read More
రామారావు మహరాజ్ కు ఘననివాళి

రాంరావు మహరాజ్ కు ఘననివాళి

సారథి న్యూస్, రామాయంపేట: రాజయోగి రాంరావు మహరాజ్ చిత్రపటానికి మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని జెడ్ చెర్వు గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Read More
వడ్ల కొనుగోళ్లు షురూ

వడ్ల కొనుగోళ్లు షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, […]

Read More